Nee Mata Naa Pataga

Lyrics in Telugu….

నీ మాట నా పాటగా – అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా – నా స్వరం వాడనీ
నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||

  1. ఏ చోట గళమెత్తినా –
    నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో – నీ రూపు కనిపించనీ2
    వినిపించుచున్నప్పుడే – ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము – లోలోన రగిలించనీ
    నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ….||నీ మాట||
  2. నీ దివ్య గానామృతం –
    జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ –
    ఫలవంతముగా మార్చనీ2
    శృతిలయలు లోపించక – విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై – నిలువెల్లా కదిలించనీ
    నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ….||నీ మాట||
  3. ఆత్మీయ గీతాలతో –
    తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై – కనువిప్పు కలిగించనీ2
    కాలక్షేపం కోసమే – పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ –
    కార్యాలు జరిగించనీ
    నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||

Nee mata naa pataga song lyrics in English

Nee maata naa paataga
anukshanam paadani
lokana ninu chataga
na swaram vaadani
naa geetam aatmalanu-
ne vaipe aakarshinchani
aadharana kaliginchi-
nilone praharshinchani….||nee maata|

1.Ye chota galametthina-
ne prema dhwanienchani
paadeti prati paatalo-nee rupu kanipinchani
vinipinchuchunnappude-udhrekamunu repakaa
sthiramaina ujjivamu lolona ragilichani
naa geetam aatmalanu
ne vaipe aakarshinchani ||nee maata||

2. Ne divya gaanamrutam
jaladharaluga pongani
thaketi prati vaarani
phalavanthamuga maarchani
shruti layalu lopinchaka
visigimpu kaliginchaka
nijamaina ullaasamai
niluvella kadilinchani
naa geetam aatmalanu
ne vaipe aakarshinchani…. ||nee maata||

3. Atmiya gitalatho –
tanuvanta pulakinchani
sangitame bhodhayai-kanuvippu kaliginchani-2
kalakshepam kosame – parimitamu kakundaga
hrudayalalo nivasinchuchu –
karyalu jariginchani
Na gitam.. Atmalanu – nivaipe akarshinchani
adaraṇa.. Kaliginchi – nilone praharṣhinchani.. ||Ni mata||

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.