Kanta Neerela

కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు        [కంట]

వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2)        [కంట]

రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2)          [కంట]

Kanta Neerela song lyrics in English

Kanta Neerela? Kalathalu Aela?
Yesutho Neevu Saagu Vela
Shodhana Vela Rodana Aela?
Ne Vishwaasamu Geliche Vela (2)
Nammina Aa Devudu – Ennadu Marachipodu
Neeyokka Avasaraalu – Aenaado Thaanerigaadu          [Kanta]

Valadu Chinthana Denikainaa
Vinnavinchumu Nee Nivedana (2)
Pondithinanu Needu Nammakamu
Dariki Cherchunu Thagina Vijayamu (2)
Thirugannade Lenivi – Aa Thandri Deevenalu
Porapaatu Eruganivi – Thaanichchu Aa Melulu (2)          [Kanta]

Repu Goorchina Bhayamu Valadu
Prathi Dinamu Thagu Baadha Kaladu (2)
Needu Bhaaramu Moyu Aa Devudu
Neeku Mundugaa Naduchu Ellappudu (2)
Neeloni Aa Bhayamu – Lokaaniki Prathiroopam
Sthiramaina Nee Vishwaasam – Devuniki Santhosham (2)          [Kanta]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.