ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము (2) [ఓ క్రీస్తు]
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) [ప్రతి కష్టము]
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) [ప్రతి కష్టము]
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) [ప్రతి కష్టము]
O Kreesthu Sanghamaa song lyrics in English
O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa
Prabhuvu Naamamulo Saage Anubandhamaa
O Priya Sanghamaa Yesayya Dehamaa
O Kanta Kanneeru Thagadu Sahavaasamaa
Prathi Kashtamu Manamu Panchukundaamu
Kalisi Andaramu Vedukundaamu (2) [O Kreesthu]
Manamanthaa Kalisi Aa Devuni Dehamu
Thandri Chitthamugaa Erpadina Sanghamu (2)
Ae Bhaagamu Shrama Padinaa Kaligenu Vedana
Okkariki Ghanathayinaa Andariki Aadarana (2) [Prathi Kashtamu]
Saati Sodarulu Shramala Paalainapudu
Saathaanu Shakthulache Shodhimpabadinapudu (2)
Dhairyamunu Nimpaali Vishwaasamu Penchaali
Edathegaka Praarthinchi Shodhananu Gelavaali (2) [Prathi Kashtamu]
Shramalu Pondevaaru Avidheyulu Kaaru
Vishwaasamu Penchukoni Devunilo Edigeru (2)
Shaanthamunu Paatinchi Devunilo Veekshinchi
Panchaali Odaarpu Vadilesi Mana Theerpu (2) [Prathi Kashtamu]