ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే [ఓ క్రైస్తవ]
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా (2)
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా [ఓ క్రైస్తవ]
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా (2)
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా [ఓ క్రైస్తవ]
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా (2)
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా [ఓ క్రైస్తవ]
O Kraistava Yuvaka song lyrics in English
O Kraisthava Yuvakaa – Nijamanthayu Ganumaa (2)
Nee Brathukanthaa Maarute Melu
Korumu Jeevamune [O Kraisthava]
Paapapu Cheekati Brathukela
Shaapamu Bhaaramu Neekela (2)
Paavana Prabhuni Paadamu Cherina
Jeevamu Needaguraa [O Kraisthava]
Maarina Jeevitha Theerulalo
Maanaka Nee Prabhu Sevaku Raa (2)
Mahima Kireetamu Manakosagunu
Ghaname Needaguraa [O Kraisthava]
Bhayapadi Venukaku Parugidaka
Balamagu Vairini Gelichedavaa (2)
Baludagu Prabhuni Vaakyamu Nammina
Gelupe Needaguraa [O Kraisthavaa]