Idiye Samayambu Randi

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి

పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా         [ఇక]

రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి            [ఇక]

బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి          [ఇక]

వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును          ||ఇక||

సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ           [ఇక]

జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి           [ఇక]

Idiye Samayambu Randi song lyrics in English

Idiye Samayambu Randi Yesuni Jerandi
Ika Samayamu Ledandi – Randi Rakshana Nondandi

Paapulanandarini – Thana Daapuna Cherchutakai
Praanamu Daanamugaa Thana Praanamu Nichchenugaa
Maranapu Mullunu Virichi – Vijayamu Nichchenugaa      [Ika]

Raajula Raajaina Yesu Raanai Yundenugaa
Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi
Tharunamundagaane – Meeru Thayyaaravvandi        [Ika]

Budhdhi Leni Kanyakavale – Moddulugaanunte
Siddelalo Noone Posi – Sidhdhapadakapothe
Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandi         [Ika]

Velupatanuntenu Meeru Vedana Nondedaru
Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandee
Mimmunu Eruganu – Meerevaro Pommanunu         [Ika]

Sandiya Padikandi – Meeru Saakulu Cheppakanu
Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi
Marana Dinamoo Mana – Merugamu Summandee        [Ika]

Jaalamu Cheyakanu – Meeru Helana Cheyakanu
Kulamu Sthalamanuchoo – Meeru Kaalamu Gaduvakanoo
Tharunamundagaane – Meeru Thvarapadi Raarandi         [Ika]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.