Apathkalamuna Naku

ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే
అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2)
తల్లి కన్నా తండ్రి కన్నా
కాచిన దేవా నీకే స్తోత్రం (2)           [ఆపత్కాలమున]

నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు
నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2)
ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు
భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు
ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు
నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా            [ఆపత్కాలమున]

నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత
రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2)
మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ
చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ
నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2)           [ఆపత్కాలమున]

apathkaalamuna Naku song lyrics in English

Neevu Nannu Parishodhinchi Parisheelinchaavu
Nenu Lechi Kurchundutanu Samasthamerigithivi (2)
Aakaashamunaku Ekkinanu Akkada Neeve Unnaavu
Boodiganthamulu Chuttinanu Akkada Neeve Unnaavu
Ee Vishwamantha Neeve Mammeluchunnaavu
Nee Kanna Daivamevaru Maa Poojyaneeyudaa              [Aapathkaalamuna]

Nenu Nadache Maargamanthatilo Nee Doothala Chetha
Raayi Thagulaka Etthukonumani Aagna Ichchithivi (2)
Maranamugundaa Vellinanu Visha Sarpamulanu Thokkinanu
Cheyi Vuduvaka Eppudunu Vidanaadaka Nanu Ennadunu
Nadipinchuchunna Devaa Neekentha Prema Naapai – (2)             [Aapathkaalamuna]

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.